పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా ''నరకాసుర''. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న ''నరకాసుర'' సినిమా ఉషా పిక్చర్స్ ద్వారా థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మూవీ టీమ్ పాల్గొన్నారు. డైరెక్టర్ సెబాస్టియన్ మాట్లాడుతూ - గత నెలలోనే ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఇన్ని రోజుల కష్టం ప్రేక్షకులకు ఎలా రీచ్ అవుతుంది అని టెన్షన్ పడ్డాం. రిలీజ్ కోసం చూస్తుంటే కొందరు ఎంకరేజ్ చేశారు. మరికొందరు డిస్కరేజ్ చేశారు. మంచి బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. రెండు వేలకు పైగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అందుకున్న ఉషా పిక్చర్స్ ద్వారా మా సినిమాను నవంబర్ 3న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. నరకాసుర అంటే దీపావళి గుర్తుకొస్తుంది. ఈ సినిమాతో దీపావళి వన్ వీక్ ముందుగానే థియేటర్స్ లోకి వస్తుందని చెప్పగలను. అన్నారు. హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ - నా సినిమా రిలీజ్ మధ్య గ్యాప్ వచ్చినా ప్రేక్షకులు ఇంకా పలాస ఫేమ్ గా గుర్తుపెట్టుకున్నారు. కాఫీ ఎస్టేట్ నేపథ్యంగా సాగే సినిమా ఇది. ఈ స్కేల్ సినిమాల్లో ''నరకాసుర'' బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అవుతుంది. క్లాస్, మాస్ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. అన్నారు.










