Oct 23,2023 14:55

దసరా సందర్భంగా నేచురల్‌ స్టార్‌ నాని కొత్తం చిత్రం టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం పేరు 'సరిపోదా శనివారం'. డీవీవీ ఎంటర్టయిన్‌ మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. నాని కెరీర్‌ లో ఇది 31వ చిత్రం. 'సరిపోదా శనివారం' చిత్రంలో నాని సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. ఎస్‌ జే సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. జేక్స్‌ బిజోరు సంగీతం అందిస్తున్నారు. ఇవాళ టైటిల్‌ తో పాటు గ్లింప్స్‌ వీడియోను కూడా చిత్రబృందం విడుదల చేసింది.