గుంటూరు : గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ ... నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద 17 రోజుల నుండి జరుగుతున్న నిరాహార దీక్షలకు మద్దతుగా ... శనివారం పెదనందిపాడు లో పలు పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా స్టేట్ బ్యాంక్ గ్రామీణ గోదావరి బ్యాంక్ ముత్తూట్ ఫైనాన్స్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ కోటక్ బ్యాంకుల వద్దకు వెళ్లి నిరసనకారులు బ్యాంకులను మూసివేయించారు అన్ని వ్యాపార సంస్థలు, హౌటల్స్, పండ్ల దుకాణాలవారు తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి బందుకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరు కుమార్, తెలుగుదేశం పార్టీ నర్రా బాలకృష్ణలతోపాటు నల్లమడ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.










