నితిన్ నార్నే హీరోగా 'మ్యాడ్' సినిమా ఈనెల ఆరోతేదీన విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం విడుదల చేశారు. నితిన్ జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి సోదరుడు. సంగీత్ శోభన్, రామ్‌నితిన్, శ్రీ గౌరీప్రియారెడ్డి, అనంతిక శనిల్ కుమార్, గోపిక ఉదయన్ ముఖ్యపాత్రలు పోషించారు. రఘుబాబు, రచ్చరవి, మురళీధర్ గౌడ్, విష్ణు, ఆంటోనీ, శ్రీకాంత్‌రెడ్డి కూడా నటిస్తున్నారు. దర్శకుడు అనుదీప్ ఇందులో ఓ ముఖ్య పాత్రను పోషించారు. రచన, దర్శకత్వం కళ్యాణ్ సుంకర. ఈనెల ఆరోతేదీన ఈ సినిమా విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు.










