Sep 29,2023 20:12

దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన హన్సిక అనతికాలంలోనే అగ్రకథానాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది. పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నాయికగా నటించిన ఆమె కథానాయికగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం మై నేమ్‌ ఈజ్‌ శృతి. శ్రీనివాస్‌ ఓంకార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మాత. నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి పోరాటం పోరాటం అనే లిరికల్‌ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్‌. దర్శకుడు మాట్లాడుతూ కృష్ణకాంత్‌ రచించిన ఈ పాటకు మార్కె కె రోబిన్‌ సంగీతం అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్‌, హారిక నారాయణన్‌, సత్య యామిని ఆలపించారు.