Oct 30,2023 09:41

దోమల నుంచి రక్షణ లేకపోతే వాటి కాటుకు గురై వివిధ వ్యాధుల భారిన పడుతుంటాం. వాటి నుంచి మనల్ని రక్షించుకునేందు మంచి దోమల తెరలు వినియోగించడం ఎంతో అవసరం. ఇంట్లో కిటికీలు, దర్వాజాలకు తగిలించే దోమతెరలు కూడా ఉన్నాయి. దుప్పట్లా కప్పుకునే దోమ తెరలూ మార్కెట్లో అందుబాటులో విరివిగా ఉన్నాయి. ఇవే కాకుండా మంచానికి సరిపడా ఏర్పాటుచేసుకునే దోమ తెరలకు ఇప్పుడు ఆదరణ బాగా పెరిగింది. మడత పెట్టేందుకు అనుకూలంగా ఉండేవి కూడా ఉన్నాయి. ప్రయాణానికి వెళ్లినప్పుడు వినియోగించడానికి కూడా అనువైనవి కూడా ఉన్నాయి. కొన్ని దోమలను చంపే పదార్థాలతో ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాడటం హానికరం. అందుకోసం డబుల్‌బెడ్స్‌, సింగిల్‌బెడ్స్‌కు సరిపోయే మృధువైన ఫ్యాబ్రిక్స్‌తో మస్కిటో నెట్స్‌ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి తెరవటానికి, మూసివేయటానికి అనుకూలంగా ఉంటాయి.
డబుల్‌బెడ్‌ నెట్‌ (క్లాసిక్‌ మస్కిటో నెట్‌ డబుల్‌బెడ్‌) : ఈ దోమల తెర డబుల్‌ బెడ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది కింగ్‌ సైజులో లభిస్తుంది. మస్కిటో నెట్‌ పీవీసీతో తయారు చేయబడింది. ఈ దోమ తెరలో ఇద్దరు పెద్దవారు, ఒక చిన్నారి నిద్రించొచ్చు. దీన్ని సులభంగా మడతపెట్టొచ్చు. ఇది సెల్ఫ్‌ సపోర్టింగ్‌ కలిగి ఉంది. జిప్పర్‌ క్లోజర్‌ను కలిగి ఉంది. మార్కెట్లో వివిధ కంపెనీలు తయారుచేసిన ఈ దోమ తెరలు అందుబాటులో ఉన్నాయి.
గుడ్‌నైట్‌ నెట్‌ బెడ్‌ (గుడ్‌నైట్‌ మస్కిటో నెట్‌) : ఈ దోమల తెర డబుల్‌ బెడ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది క్వీన్‌ సైజ్‌ బెడ్‌. 30 జీఎస్‌ఎం స్ట్రాంగ్‌ నెట్‌ కలిగి ఉంది. ఇది ఎక్కువ కాలం మన్నుతుంది. పోల్డబుల్‌. అంటే సులవుగా మడత పెట్టొచ్చు. ఇది తక్కువ బరువు కలిగి ఉంది. దీన్ని సులువుగా సెట్‌ చేసుకోవచ్చు.
పాలిస్టర్‌ ఫోల్డబుల్‌ (క్లాసిక్‌ మస్కిటో నెట్‌ ప్రీమియమ్‌ పాలిస్టర్‌ పోల్డబుల్‌ :
ఈ దోమల తెర ప్రీమియం పాలిస్టర్‌ ఫ్యాబ్రిక్‌తో తయారు చేయబడింది. దీన్ని బెడ్‌ పై సులభంగా ఉంచొచ్చు. సులభంగా ఉతుక్కోవచ్చు. దీని మెష్‌ ఎంతో బిగుతుగా ఉంటుంది. రెండు జిప్పర్‌ క్లోజర్‌ కలిగి ఉంది. సులువుగా దోమల తెరలోనికి వెళ్లొచ్చు.
హెల్తీ స్లీప్‌ (హెల్తీ స్లీపింగ్‌ పోర్డబుల్‌ పోలిస్టర్‌ డబుల్‌ బెడ్‌ మస్కిటో నెట్‌ : ఈ దోమల తెరను సులభంగా మడతపెట్టొచ్చు. పాలిస్టర్‌ మెటీరియల్‌తో తయారు చేయబడింది.