
దేవరాపల్లి (పశ్చిమ గోదావరి) : దేవరాపల్లి, మండల కేంద్రానికి మరిన్ని బస్సు సౌకర్యాలు పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న విజ్ఞప్తి చేశారు. సోమవారం వెంకన్న ఓప్రకటన విడుదల చేశారు. ఎస్.కోట, విజయనగరం, చోడవరం, అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసుకు బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బస్సు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో చోడవరంకు రెండు ప్రైవేటు బస్సులు ఉండేవని ఇవి చాలకాలం నుండి నడవకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేవరాపల్లి మండల కేంద్రానికి ఆనంతగిరి మండలానికి ఆకోని గిరిజన గ్రామాలకు ముఖద్వారం అవ్వడం అటు గిరిజనులకు ఇటు దేవరాపల్లి మండల ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. దీంతో విజయనగరం జిల్లా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంకు ప్రజల ప్రయాణం పెరుగుతుందని, వీటికి బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా దేవరాపల్లి ప్రజలకు సౌకర్యం, కల్పించడంతోపాటు దేవరాపల్లి మండల కేంద్ర అభివఅద్దికి తోడ్పడుతుందని వెంకన్న తెలిపారు. వెంటనే ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.