ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సోషల్ మీడియాలో మరింత చురుగ్గా కృషి చేయాల్సిన అవసరముందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆ పార్టీ ఐటి విభాగాన్ని ఆదేశించారు. పార్టీ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేసేలా ఐటి విభాగం బలోపేతం కావాలన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లాల ఇన్‌చార్జీలు, వివిధ మోర్చాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల స్థాయి వరకు పార్టీ విస్తరణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. నేతలు కార్యకర్తలతో మమేకం కావాలని ఆమె పిలుపునిచ్చారు.










