ప్రజాశక్తి- పుత్తూరుటౌన్ (తిరుపతి) : ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని మంత్రి రోజా ఆదివారం పరామర్శించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి సుబ్రమణ్యం రెడ్డి ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి మరత్రి రోజా చెవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి చిత్రపటాన్ని నివాళులర్పించి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి అకాల మరణాపట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.










