మిడ్ వైఫరీ మొదటి శిక్షణ పొందినవారు ఆదర్శంగా నిలవాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి : రాష్ట్రంలోనే మిడ్ వైఫరీ మొదట శిక్షణ పొందిన 30 మంది సిజియరిన్ లేని ప్రసవాల విషయంలో డాక్టర్లకు ఏమాత్రం తీసిపోబోమని నిరూపించి మిడ్ వైఫరీ లు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో మిడ్ వైఫరీ లెడ్ కేర్ యూనిట్ లను ప్రారంభించి, అంతర్జాతీయ మిడ్ వైఫరీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ... అంతర్జాతీయ మిడ్ వైఫరీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యపరంగా జిల్లా యంత్రాంగం ఎప్పుడు మీకు సహకారం అందిస్తుందని అన్నారు. నేడు మిడ్ వైఫరీ లెడ్ యూనిట్ ప్రారంభోత్సవంలో భాగస్వామ్యలను చేసినందుకు ధన్యవాదాలని, రాష్ట్రంలోనే తిరుపతిలో మొదటి మిడ్ వైఫరీ లెట్ యూనిట్ ఏర్పాటు కావడం గొప్ప విషయమని అన్నారు. దేశంలోనే ఒక్క మన రాష్ట్రం మాత్రమే ప్రతి సచివాలయ పరిధిలో హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. హిస్టరీ రిపీట్ ఇట్ సెల్ఫ్ అన్నది ప్రస్తుతం అన్ని రంగాలు అటువైపు చూడడం చూస్తున్నామని, అవసరం కూడా అని అన్నారు. గతంలో పెరుగుతున్న జనాభాకు ఆహార ధాన్యాల కొరత రాకుండా గ్రీన్ రెవల్యూషన్ ఏర్పాటుతో ఆహార ఉత్పత్తులను పెంచగలిగామని అందులో వాడుతున్న రకరకాల మందుల వల్ల భూమి ,వాతావరణం కాలుష్యం అవుతున్న కారణంగా నేడు మనం తిరిగి పాత పద్ధతిలో ప్రకఅతి వ్యవసాయం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు. నేడు అదే రీతిలో మిడ్ వైఫరీ అవసరమని గుర్తించి యునిసిఫ్ సహకారంతో శిక్షణ ఇవ్వడం సంతోషం అని అన్నారు. డాక్టర్లకు ఏమాత్రం తీసిపోము అనే విధంగా వైద్య సేవలు అందిస్తూ మరింతమందికి శిక్షణ ఇవ్వగలిగేలా ఉండాలని రాష్ట్రంలోని ఫస్ట్ బ్యాచ్ ది బెస్ట్ బ్యాచ్ అని నిరూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మిడ్ వైఫరీ లెడ్ యూనిట్లను జిల్లా కలెక్టర్ ప్రారంభించి వాటి వినియోగం ఉపయోగాలపై సంబంధిత డాక్టర్ల ను అడిగి తెలుసుకున్నారు. హై రిస్క్ వార్డులో పర్యటించి అందుతున్న వైద్య చికిత్సలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్.పి.గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్.మరియా రోజమ్మ , ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.పార్థసారధి, సూపరింటెండెంట్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ డాక్టర్ రాధా రెడ్డి, యునిసెఫ్ డాక్టర్ శ్రీధర్ ర్యావంకి, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ కె.నాగమునేంద్రుడు, ఎస్.వి.మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఎ.చంద్రశేఖరన్, డీఎంహెచ్వో డాక్టర్.యు.శ్రీహరి, మిడ్‌వైఫరీ అధ్యాపకురాలు బి.ఎస్.హేమలత, డాక్టర్ భారతి, మిడ్ వైఫరీ, విద్యార్థులు పాల్గొన్నారు.










