Oct 10,2023 17:13

తిరువనంతపురం : మంగళవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌ మానసిక ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాలి అని అన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 'సమాజంలో సామాజిక సాంస్కృతిక సంబంధాలకు దూరంగా ఉన్న ప్రజల మానసిక ఆరోగ్యాన్ని గుర్తించడం అత్యవసరం. మానసిక ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. అది అందరికీ అందాలి. పెట్టుబడిదారీ విధానం యొక్క పోటీ మరియు దోపిడీ స్వభావం రోజువారీ జీవితంలో సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తున్నది. మెరుగైన ప్రపంచం కోసం పోరాటాల ద్వారా మాత్రమే ప్రశాంతతను సాధించవచ్చు.' అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.