వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ శుక్రవారం సాయంత్రం చిరంజీవి నివాసంలో జరిగాయి. కొణిదెల కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. కొత్త జంటకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తాజాగా చిరంజీవి నెట్టింట షేర్ చేశారు. 'వరుణ్‌తేజ్ లావణ్యల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిన్న సాయంత్రం వేడుకగా జరిగాయి' అని ఆయన పేర్కొన్నారు. నిశ్చితార్థం మాదిరిగానే పెళ్లి కూడా సింపుల్‌గా ఉంటుంది'' అని వరుణ్‌తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే వీరి పెళ్లి జరగొచ్చునని తెలుస్తోంది. కుటుంబసభ్యులు, అతి తక్కువమంది బంధువుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఉండొచ్చని సమాచారం.










