Apr 13,2023 21:51

హైదరాబాద్‌ : ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌తో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కొత్త కార్లు, ప్రీ ఓన్డ్‌ కార్లు, వాణిజ్య వాహనాలు కొనుగోలు చేసే వారికి సులభంగా రుణాలు అందుతాయని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందంపై ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ ఎండి వి వైద్యనాథన్‌, మారుతి సుజుకి మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవా సంతకాలు చేశారు.