Sep 27,2023 17:57

నైట్రో స్టార్‌ సుధీర్‌ బాబు, యాక్టర్‌ -ఫిల్మ్‌ మేకర్‌ హర్షవర్ధన్‌ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మామ మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పి పై నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్‌ బజ్‌ ని క్రియేట్‌ చేసింది. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు లాంచ్‌ చేశారు. ''మామా మశ్చీంద్ర ట్రైలర్‌ లాంచ్‌ చేయడం ఆనందంగా వుంది. ట్రైలర్‌ బ్లాస్ట్‌ గా ఉంది! సుధీర్‌ బాబు, టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' తెలియజేశారు మహేష్‌ బాబు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌కి చెందిన సోనాలి నారంగ్‌, సృష్టి సమర్పిస్తున్నారు. మామా మశ్చీంద్ర అక్టోబర్‌ 6న థియేటర్లలోకి రానుంది.