కంచికచర్ల మండలం (ఎన్‌టిఆర్) : కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో గొర్రెపాటి శ్రీనివాసరావు మఅతి చెందడంతో బుధవారం ఆయన భౌతికకాయాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.










