- సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు
ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : ఉద్యోగ, కార్మిక, ప్రజా పోరాటాలకు అండగా నిలబడుతు సమస్యలపై పోరాడే పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్ధి మీగడ వెంకటేశ్వరరెడ్డి గెలిపించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో చీరాల బ్రాంచ్ ఐఎల్టిడి ఫెడరేషన్ కార్మికుల సమావేశం ఫెడరేన్ అద్యక్షుడు బి పోతురాజు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, నిరుద్యోగులు, కూలీలు, రైతులా సమస్యలపై చట్టసభల్లో మాట్లాడేటువంటి అభ్యర్ధులని గెలిపించడం ద్వార ఉద్యమాలు ముందుకు వెళతాయన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) తరుపున గెలిచినా ఎమ్మెల్సీలు నిజాయితీగా అనేక ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం అవటంతో పాటు,రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హౌదా ఇ వ్వలని,నిరుద్యోగ సమస్యలు పరిష్కరించి,జాబ్ క్యాలండర్ ప్రకారం జాబ్ లు ఇవ్వాలని, వ్యవసాయకూలీ,రైతాంగ సమస్యలు,ప్రజలపై పడుతున్న ఆర్టీసీ,విద్యుత్ చార్జీలు,ఇతర అధిక ధరలను తగ్గించాలని చట్టసభల్లో నిలదీస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ ఉద్యోగులు,వివిధ పథకాల్లో పనిచేస్తున్న స్కీము వర్కర్స్,పరిశ్రమలో పని చేస్తున్నా కార్మికులకు కనీస వేతనాలు అమలుచేయాలని, ఇతర సమస్యల పరిష్కరించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు నిరంతరం ఉద్యోగా,కార్మికులు పోరాటాల్లో భాగస్వామ్యం అవుతు అండగా ఉంటారన్నారు.కావున ఈ నెల13న జరుగబోయే తూర్పు రాయలసీమ పట్టభద్రుల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షడు సిహెచ్.మణిలాల్,జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్. మజుందార్, జిల్లా నాయకులు ఎన్. బాబూరావు,ఐఎల్టిడి ఫెడరేషన్ చీరాల బ్రాంచ్ కార్యదర్శి జి.సుధీర్, పెడరేషన్ నాయకులు పి.ఖాలేషా, సుధాకర్,శివరాజ్,సురేంద్ర, ఇమ్మనియేలు, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.










