కొరటాల స్ఫూర్తితో ఉద్యమిద్దాం : సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కొరటాల సత్యన్నారాయణ స్ఫూర్తితో పేద, బడుగు బలహీవర్గాల హక్కులు, పేదలు రాజ్యం కోసం ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. కొరటాల సత్యన్నారాయణ శత జయంతి సందర్భంగా ... ఆదివారం స్థానిక ఎల్‌బిజి భవనంలో జరిగిన శత జయంతి ఉత్సవాలు సందర్భంగా, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .... సిపిఎం మేధావిగా, సంపన్న కుటుంబంలో జన్మించిన ఆయన పేదల విముక్తి కోసం సిపిఎం లో పని చేయడం జరిగిందన్నారు. సిపిఎం అభ్యున్నతికి ఎనలేని కృషి చేయడంతోపాటు, దోపిడీదారులు పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ప్రజాశక్తి పత్రిక అభివృద్ధిలో ఆయన ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగిందన్నారు. ధనిక వర్గంలో పుట్టి పేదలు కోసం, కష్ట.జీవులు కోసం ఆలోచించడమే మన ఆస్తి, మన ఉద్యమాలకు వారు స్ఫూర్తి అన్నారు. ఆయన మొత్తం ఆస్తిని పార్టీకి అంకితం చేయడం, ఆప్యాయత, అనురాగాలకి ప్రతీక అన్నారు. అలాంటి స్ఫూర్తిప్రదాత అసాయలను మన ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. ఆయన అశయాలను సాధించడం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతర రెడ్డి శంకరరావు మాట్లాడుతూ ... రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉద్యమాలు నడిపిన వ్యక్తి అన్నారు. ప్రజాశక్తి పేపర్ పేరు ప్రజల్లోకి వెళ్లేందుకు చేసిన కృషి స్ఫూర్తి అన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు కోసం దీపిక అనే సంచికను తీసుకొచ్చిన వ్యక్తి ఆయన అన్నారు. ఆయన స్పూర్తితో నేటి పార్టీ కార్యకర్తలు, నాయకులు పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వి.లక్ష్మి పి.రమణమ్మ, కె.సురేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










