May 12,2023 12:50

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : మే 13 న తిరుమల మార్గాల్లో జిల్లా యంత్రాంగం తరపున అధికారులు స్వచ్చందంగా పాల్గని ''శుద్ధ తిరుమల - సుందర తిరుమల'' గా తిరుమల మార్గాన్ని మార్చడానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిద్దామని జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్‌ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ... తిరుమల రెండు ఘాట్‌ రోడ్లు, రెండు నడకదారుల్లో మే 13న శనివారం టిటిడి ఉద్యోగులతో కలిసి జిల్లా యంత్రాంగం, తదితరులతో సామూహికంగా ''శుద్ధ తిరుమల - సుందర తిరుమల'' కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొని మన తిరుమల మార్గాన్ని స్వఛ్చతగా ఉండేలా మన వంతు స్వచ్ఛందంగా కఅషి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం కు చెందిన వివిధ శాఖల అధికారులు అలిపిరి మార్గంలో సుమారు రెండు నుండి మూడు కిలో మీటర్ల మేర ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరివేసే కార్యక్రమంలో పాల్గని ఈ కార్యక్రమంతో తిరుమలను పర్యావరణహితంగా మార్చడంపై భక్తులకు సామాజిక స్పఅహ అవగాహన వస్తుందని, తిరుమలకు ప్లాస్టిక్‌ బాటిళ్లు, నాన్‌ డిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ను తీసుకురావడాన్ని పూర్తిగా నివారించడంలో భాగంగా కూడా ఈ కార్యక్రమం ఒక మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. తిరుమలను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం ఉద్యోగులు అంకితభావంతో పాల్గని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, డిఎఫ్‌ ఓ.సతీష్‌ రెడ్డి, తదితర వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.