Oct 05,2023 20:47

కోలీవుడ్‌ హీరో విజయ్ నటించిన తాజా సినిమా 'లియో'. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదలకు ముందే ఈ సినిమా రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. విజరుకు విదేశాల్లోనూ భారీగా అభిమానులున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓవర్సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఇప్పటి వరకు 40 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇంకా థియేటర్ల సంఖ్య పెంచుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇంత వరకు ఏ భారతీయ సినిమాకు ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోలేదని యూకేకు చెందిన నిర్మాణ సంస్థ తెలిపింది. ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేయకుండానే ఇంత భారీ మొత్తంలో టికెట్లు సేల్‌ అవ్వడం రికార్డని పేర్కొంది. విడుదల ముందు నాటికి ఈ సంఖ్య 50 వేలకు చేరుతుందని నిర్మాణ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.