ప్రజాశక్తి-పెద్దకడబూరు (కర్నూలు) : ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలను అవలంభిస్తున్న బిజెపి సర్కారును సాగనంపాలని సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న గౌడ్, సిపిఐ మండల కార్యదర్శి వీరేశు, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేశు పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దకడవోరు మండల పరిధిలోని బసలదొడ్డి, పులి, కణం, ముచ్చి, గిరి, నవులేకల్ గ్రామాలలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ గ్రూప్ మీటింగులు నిర్వహిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ప్రచారభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక పాలనపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమమే ప్రచార భేరి అని గుర్తు చేశారు. సిపిఎం సిపిఐ పార్టీల చేపట్టిన ఈ కార్యక్రమంలో వెంకటేష్, వీరన్న, రామ్ రెడ్డి, నాగప్ప, చిన్న వెంకటేశు, ఆనందు, గోపాల్, బసవరాజ్, నాగభూషణ్, ఈరన్న, తదితరులు పాల్గొన్నారు.










