ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా లామ్ తాంతియా కుమారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు సోమవారం ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నియమించినట్లు ఎఐసిసి కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఎపితోపాటు బీహార్, జమ్ముకాశ్మీర్, త్రిపుర, రాజస్థాన్ రాష్ట్రాలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. గతంలో కృష్ణా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా లామ్ తాంతియా కుమారి వ్యవహారించారు.










