కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత వీఏ దురై (59) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రజనీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటి హీరోలతో ఆయన సినిమాలు తీశారు. గజేంద్ర చిత్రం తర్వాత దురై సినిమాలకు దూరమయ్యారు. తనను ఆర్థికంగా ఆదుకోవాలని ఓ వీడియో విడుదల చేయడంతో హీరో సూర్య ఇటీవల సహాయం చేశారు. దురై మృతునికి కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.










