Oct 09,2023 17:29

యూత్‌ఫుల్‌ ఫన్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లు మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ సబ్జెక్ట్‌లు. కామ్రెడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్‌ కలిసి మోస్ట్‌ ఎంటర్‌ టైనింగ్‌ బడ్డీ కామెడీ 'కిస్మత్‌'ను రూపొందిస్తున్నారు. శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, అవసరాల శ్రీనివాస్‌, విశ్వ దేవ్‌ బెస్ట్‌ బడ్డీలుగా కనిపించనుండగా, రియా సుమన్‌ హీరోయిన్‌. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేయడం ద్వారా మేకర్స్‌ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. హీరో సత్యదేవ్‌ ప్రధాన తారాగణాన్ని పరిచయం చేస్తూ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు.
ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో నరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, అవసరాల శ్రీనివాస్‌, విశ్వ దేవ్‌, రియా సుమన్‌ ఎందుకో కలవరపడుతున్నట్లు కనిపించారు. బ్యాక్‌ గ్రౌండ్‌లో కరెన్సీ నోట్లు ఉన్నాయి. 'కిస్మత్‌' అంటే అదృష్టం. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇది ఫన్‌ రైడ్‌గా సాగుతుందని భరోసా ఇస్తుంది. రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సిహెచ్‌ భానుప్రసాద్‌ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేదరామన్‌ శంకరన్‌ డీవోపీగా పని చేస్తుండగా, మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందిస్తున్నారు. విప్లవ్‌ నైషధం ఎడిటర్‌. కిస్మత్‌ షూఉటింగ్‌ మొత్తం పూర్తయింది. సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.