Sep 25,2023 19:50

నటి కీర్తి సురేష్‌ కూడా హిందీలో ఆరంగేట్రం చేస్తోంది. వరుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ కథానాయికిగా నటించనుంది. ఇది తమిళ సినిమా 'తెరి'కి రీమేక్‌. తమిళ దర్శకుడు కలీస్‌ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ సినిమా 'తెరి' దర్శకుడు అట్లీ ఈ హిందీ రీమేక్‌ నిర్మాతల్లో ఒకరు. 'తెరి' సినిమాలో విజరు కథానాయకుడు కాగా, కథానాయకులు సమంత రూతు ప్రభు, అమీ జాక్సన్‌ నటించారు. హిందీలో సమంత పాత్రని కీర్తి సురేష్‌ చేస్తోంది.