Sep 25,2023 19:46

ధనలక్ష్మి క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనీ సుందరరాజన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం కపిల్‌ రిటన్స్‌. నటి నిమిషా రియాజ్‌ ఖాన్‌, పరుత్తివీరన్‌ సరవణన్‌, వయాపురి మాస్టర్‌ భరత్‌, మాస్టర్‌ జాన్‌, బేబీ షర్షా ముఖ్యపాత్రలు పోషించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించారు. చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు శ్రీనీ సుందర రాజన్‌ మాట్లాడుతూ ఇది 'మీ కలలు నెరవేరాలంటే శ్వాస ఉన్నంతవరకు ప్రయత్నించు' అనే ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం' అని చెప్పారు.