షారుక్ ఖాన్, నయనతార, దీపిక పడుకొనే, ప్రియమణి ప్రధాన తారగణంగా తెరకెక్కిన 'జవాన్' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 2నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం ఓటీటీ కట్ వెర్షన్ మరోలా ఉండబోతుందని తెలుస్తోంది. సెన్సార్ కత్తెర పడిన చాలా సీన్స్‌ను ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేస్తున్నట్లు సమాచారం. హిందీ మీడియా టాక్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ లెంగ్త్ 3 గంటల పైమాటే. థియేటర్‌లో ఈ సినిమా 2 గంటల 45 నిమిషాల నిడివితో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించారు. షారుఖ్ తండ్రి, కొడుకులా ద్విపాత్రాభినయం చేశారు.










