Oct 03,2023 18:26

మరో 17 రోజుల్లో టైగర్స్‌ హంట్‌ ప్రారంభమవుతుంది. మాస్‌ మహారాజా రవితేజ టైటిల్‌ రోల్‌లో, యంగ్‌ ట్యాలెంటెడ్‌ వంశీ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం 'టైగర్‌ నాగేశ్వరరావు' పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ లు ది కాశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ 2ని అందించిన సక్సెస్‌ ఫుల్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 20న గ్రాండ్‌ గా థియేటర్స్‌ లో విడుదల కానుంది. ముంబైలో జరిగిన గ్రాండ్‌ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. నాగేశ్వరరావు రాకతో రాబరీ పద్దతులు మారిపోయాయి. అతనికి అధికారం దాహం, స్త్రీలపై కాంక్ష, డబ్బు కోసం వ్యామోహం ఉంది. ఎవరినైనా కొట్టడానికి, ఏదైనా దోచుకోవడానికి ముందు హెచ్చరికలు చేయడం కూడా అతనికి అలవాటు. అయితే, నాగేశ్వరరావును ఎలిమినేట్‌ చేయడానికి ఒక బ్యాడ్‌ పోలీసు వస్తాడు. స్టూవర్టుపురం నాగేశ్వరరావు కథ అతని అరెస్టుతో ముగిసింది, అయితే టైగర్‌ నాగేశ్వరరావు కథ అక్కడి నుండి ప్రారంభమవుతుంది. నేషనల్‌ థ్రెట్‌ గా మారిన టైగర్‌ నాగేశ్వరరావు నెత్తుటి వేట సాగుతుంది.
రెండున్నర నిమిషాల ట్రైలర్‌ లో నాగేశ్వరరావు జీవితంలోని కీలక ఘట్టాలను చూపించారు. టైటిల్‌ రోల్‌లో రవితేజ యంగ్‌గా, డైనమిక్‌గా, వైల్డ్‌, బ్రూటల్‌ గా కనిపించారు. మాసీ రోల్‌ లో రవితేజ ట్రాన్స్‌ ఫర్మేషన్‌ అద్భుతంగా వుంది. ప్రతి నటుడికీ నటించడానికి ఒక స్పేస్‌, స్కోప్‌ వుంది. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ ఫీమేల్‌ లీడ్‌ గా కనిపించారు, రేణు దేశారు, అనుపమ్‌ ఖేర్‌, నాజర్‌, జిషు సేన్‌గుప్తా, హరీష్‌ పెరడి, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో మాస్‌ మహారాజ రవితేజ మాట్లాడుతూ.. టైగర్‌ నాగేశ్వరరావు తో హిందీలోకి రావడం ఆనందంగా వుంది. హిందీకి నేనే డబ్బింగ్‌ చెప్పాను. టైగర్‌ నాగేశ్వరరావు తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది'' అన్నారు.
అనుపమ్‌ ఖేర్‌ మాట్లాడుతూ.. చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేశాం. అభిషేక్‌ గ్రేట్‌ ప్రొడ్యుసర్‌. ఎప్పుడూ నవ్వుతూ వుంటారు. ఆయన పాజిటివిటీ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడు వంశీ జీవితం మారుతుంది. ఈ సినిమాలో అందరితో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఇప్పుడు సౌత్‌ నార్త్‌ సినిమా అనే తేడా లేదు. ఇప్పుడంతా ఇండియన్‌ సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది '' అన్నారు.
నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. రవితేజ గారితో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. మాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి ధన్యవాదాలు. దర్శకుడు వంశీ చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. అనుపమ్‌ ఖేర్‌ గారు మా ఫ్యామిలీ మెంబర్‌ లానే వుంటారు. చాలా ప్యాషన్‌ తో ఈ సినిమాని తీశాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. రవితేజ గారు ఈ కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతోగానో సపోర్ట్‌ చేశారు. ప్రతి అడుగులో నాకు అండగా నిలబడ్డారు. ఆయకి మనస్ఫూర్తిగా కతజ్ఞతలు. రవితేజ గారు ఫిల్మ్‌ లవర్‌. ఈ సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. ఆయన వలనే ఈ సినిమా సాధ్యపడింది. దాదాపు 500 పైగా చిత్రాలు చేసిన అనుపమ్‌ గారితో ఈ సినిమాలో పని చేయడం ఆనందంగా వుంది. అలాగే నుపూర్‌, గాయత్రి, రేణు దేశారు గారు చాలా మంచి నటీనటులతో ఈ చిత్రాన్ని చేశాం. అభిషేక్‌ గారు చాలా గ్రాండ్‌ గా ఈ సినిమా తీశారు . టైగర్‌ నాగేశ్వరరావు చాలా ప్రత్యేకమైన సినిమా. అందరినీ అలరిస్తుంది'' అన్నారు.
రేణు దేశారు మాట్లాడుతూ.. వంశీ ఈ కథ చెప్పినప్పుడే .. చాలా పెద్ద దర్శకుడౌతారని చెప్పాను. ఈ కథ విన్న వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పాను. అభిషేక్‌ గారు చాలా మంచి ప్రొడక్షన్‌ వాల్యూస్‌ తో ఈ సినిమాని నిర్మించారు'' అన్నారు. ఈ ఈవెంట్లో చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.