Oct 25,2023 14:44

జెరూసలెం :   ఇజ్రాయిల్‌ సిరియాపై వైమానిక దాడి జరిపినట్లు సిరియా స్టేట్‌ మీడియా తెలిపింది. బుధవారం తెల్లవారుజామున జరిపిన దాడిలో దక్షిణ సిరియాలోని ఎనిమిది మంది సైనికులు మరణించినట్లు వెల్లడించింది. తెల్లవారుజామున 1.45 గంటలకు ఇజ్రాయిల్‌ ఆక్రమిత గోలన్‌ హైట్స్‌ నుండి వైమానిక దాడి చేసిందని, ఈ దాడిలో మరో ఏడుగురు సైనికులకు గాయాలయ్యాయని తెలిపింది. కొంతమేర వస్తునష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. గతంలో క్షిపణి దాడులకు ప్రతిగా ఇజ్రాయిల్‌ ఈ దాడి చేసినట్లు పేర్కొంది.