Apr 11,2023 21:36

ముంబయి: ఆలిండియా ఫిడే ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో 12ఏళ్ల ఇషాన్‌ టెండూల్కర్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మంగళవారం జరిగిన 6వ రౌండ్‌ పోటీలో ఇషాన్‌ గెలిచి 5.5పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 6వ రౌండ్‌ పోటీలో ఇషాన్‌ 2వ సీడ్‌ సౌరవ్‌ ఖర్డేకర్‌పై విజయం సాధించాడు. దీంతో 6వ రౌండ్‌ ముగిసేసరికి మరో ముగ్గురితో కలిపి సంయుక్తంగా 5.5పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఇక టాప్‌సీడ్‌ 14ఏళ్ల కె. జైస్వాల్‌(ఇఎల్‌ఒ 1356) మూడోసీడ్‌ రాఘవ్‌ శ్రీవాస్తవ్‌(ఇఎల్‌ఓ 2066)పై గెలిచాడు. మొత్తం 11మంది ప్లేయర్స్‌మధ్య జరిగే ఈ టోర్నమెంట్‌లో టైటిల్‌ విజేతకు రూ.3లక్షల నగదుతోపాటు ట్రోఫీ దక్కనుంది.