Oct 27,2023 10:47

జెరూసలెం : హమాస్‌ మిలిటెంట్లకు ఇరాన్‌ శిక్షణ ఇచ్చిందంటూ ఇజ్రాయెల్‌ ఆరోపించింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి జరగక ముందే ఇరాన్‌.. హమాస్‌ మిలిటెంట్లకు శిక్షణ అందించడంతోపాటు డబ్బు, ఆయుధాలను కూడా ఇచ్చిందని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడిఎఫ్‌) ఆరోపించింది. పాలస్తీనా మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇరాన్‌ హస్తం కూడా ఉందని ఇజ్రాయెల్‌ పేర్కొంది. ఐడిఎఫ్‌ ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారి మాట్లాడుతూ.. 'ఈ యుద్ధానికి ముందుగానే ఇరాన్‌.. హమాస్‌ మిలిటెంట్లకు శిక్షణ, ఆయుధాలు, నిధులు, సాంకేతికత సహాయాన్ని అందించింది' అని అన్నారు. హమాస్‌కు ఆర్థికసాయం, శిక్షణ, ఆయుధాలు అందిస్తున్నట్లు ఇరాన్‌ అంగీకరించినప్పటికీ, ఇజ్రాయెల్‌ దాడిలో తమ పాత్ర లేదని పేర్కొంది.