Sep 25,2023 19:58

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గేమ్‌ చేంజర్‌'. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, సునీల్‌, నవీన్‌ చంద్ర, ఎస్‌జే సూర్య, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'గేమ్‌చేంజర్‌' తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెల 20 నుంచి ప్లాన్‌ చేశారు. అయితే ఈ షెడ్యూల్‌ రద్దయింది. రెండురోజుల క్రితం షూటింగ్‌లో రామ్‌చరణ్‌ గాయమైందనీ, డాక్టర్‌ పది రోజుల వరకు విశ్రాంతి తీసుకోమన్నారని తెలుస్తోంది. ఈ కారణంగా షూటింగ్‌ రద్దయినట్లు సమాచారం. 'దిల్‌' రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సంగీతం తమన్‌ అందిస్తున్నారు.