Jul 29,2023 12:17

కాశీబుగ్గ (శ్రీకాకుళం) : జీడికి మద్దతు ధర కల్పించాలని, జీడి పిక్కలను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ... కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద శనివారం ఉదయం రైతు సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. సీనియర్‌ నాయకులు బమ్మిడి శ్రీరాములు, మెట్టూరు ఎంపీటీసీ కొండప్ప, సురేఖ కలిసి దీక్షలో కూర్చున్నవారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు.