బెంగళూరు : ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో టాప్ ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై చెప్పారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో రాజీనామా చేశారు. 22 ఏళ్లుకు పైగా రిచర్డ్ ఇన్ఫోసిస్‌లో పని చేశారు. 2015 నుంచి 2023 వరకు కంపెనీలో హెచ్‌ఆర్ హెడ్‌గా పనిచేశారు. ఆగస్ట్ 31 వరకు ఆయన ఇన్ఫోసిస్‌లో కొనసాగుతారని ఆ కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్ హెడ్‌గా సుశాంత్ తరప్పన్ నియామకాన్ని ప్రకటించిన కొన్ని వారాల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.










