Oct 16,2023 18:45

అజయ్ హీరోగా, సీనియర్‌ హీరోయిన్‌ ఇంద్రజ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం మూవీ 'సిఎం' పెళ్ళాం' (కామన్‌ మ్యాన్‌ పెళ్ళాం). వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్‌ బేనర్‌పై బొల్లా రామకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రమణారెడ్డి కథ స్క్రీన్‌ ప్లే డైలాగ్స్‌ అందిస్తూ సినిమాని డైరెక్ట్‌ చేస్తున్నారు. సోమవారం ఉదయం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెలాఖరు వరకు మొదటి షెడ్యూల్‌ జరగనుందని చిత్రబృందం వెల్లడించారు. సీఎంగా అజయ్, సీఎం భార్యగా ఇంద్రజ, హోమ్‌ మినిస్టర్‌గా సురేష్‌ కొండేటి నటిస్తున్న ఈ సినిమాలో హీరో సుమన్‌ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రిన్స్‌ హనీ సంగీతం అందిస్తున్నారు.