Jun 11,2023 11:40

ప్రజాశక్తి-గాజువాక (విశాఖ) : కరెంట్‌ చార్జీలను పెంచడాన్ని ప్రతిఘటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఉదయం గాజువాక సమైక్‌ అపార్ట్‌మెంట్‌లో సత్యనారాయణ మాస్టర్‌ ఇంటికి వి.శ్రీనివాసరావు వచ్చారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ... చెత్త పన్నుతో పాటు కరెంట్‌ చార్జీలు పై రేట్లను పెంచడంపై ఉద్యమించాలని కోరారు. ప్రపంచ బ్యాంకు షరతుల్లో భాగంగా వీటిని అమలు చేస్తున్నారన్నారు. చెత్త పన్నుపై ఒత్తిడి పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కార్యదర్శి లోకనాథం సమైక్‌ అపార్ట్‌మెంట్‌ సభ్యులు పాల్గొన్నారు.