
మధ్యప్రదేశ్ : పెరిగిన టమాటా ధరలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడో యువకుడు. తన సెల్‌ఫోన్ షాపులో స్మార్ట్‌ఫోన్ కొంటే.. 2 కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని విచిత్ర ఆఫర్‌ను ప్రకటించాడు. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ పట్టణంలో అశోక్ అగర్వాల్ అనే యువకుడు సెల్‌ఫోన్ దుకాణం నడుపుతున్నాడు. కొన్ని రోజులుగా పెరిగిన టమాటా ధరలు.. వాటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించాడు. దీంతో అతడికి ఓ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా.. తన షాపులో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వారికి రెండు కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు ఆ దుకాణానికి వరుస కడుతున్నారు. ఈ ఆఫర్ వల్ల కస్టమర్ల సంఖ్య పెరిగిందని.. స్మార్ట్‌ఫోన్లు కూడా ఎక్కువగా అమ్ముడయ్యాయని అశోక్ సంతోషం వ్యక్తం చేశాడు.