'నా జీవితంలో లేని అనుభవాల్ని 'భగవంత్ కేసరి' ఇచ్చింది. ఇందులో నేను వరంగల్ అమ్మాయిగా కనిపిస్తాను. ఈ చిత్రం బ్యూటీఫుల్ స్టోరీ. అందుకే ఇక్కడకు శ్రీలీలలా రాలేదు.. ఇందులో పాత్ర అయిన విజ్జి పాపలా వచ్చాను. విజ్జి పాప అనే పేరు పెట్టిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. ఈ పాత్ర చేయడం నా అదష్టం. బాలకృష్ణ గారితో పని చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఇందులో చాలా అందమైన సీన్స్ వున్నాయి. కట్ చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్‌లో కంటిన్యూ అయిపోయేదాన్ని. అప్పుడు బాలకృష్ణగారు సరదాగా జోకులు వేసి నవ్వించేవారు. నా జీవితంలో లేని అనుభవాల్ని ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చారు. నాకు అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థాంక్స్. అక్టోబర్ 19న సినిమా వస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్లలో చూడండి' అని ఇటీవల వరంగల్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో 'భగవంత్ కేసరి' చిత్ర విశేషాలను శ్రీలీల అభిమానులతో పంచుకున్నారు. బాలకృష్ణ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీలీల కీలక పాత్రలో కనిపిస్తున్నారు.










