ప్రజాశక్తి-కాకినాడ : రాజకీయ ఉగాది పచ్చడిలో రుచులన్నీ నాకు తెలుసని తెలియచేస్తూ ... తన రాజకీయ జీవితం తెరచిన పుస్తకం అని కాకినాడ నగర శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్ధానిక డి కన్వెన్షన్ హాలులో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ... జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటనలో కత్తిపూడిలో, పిఠాపురంలో తనపై చేసిన ఆరోపణలకు బదులిస్తూ, తాను కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పైకొచ్చి రెండు సార్లు శాసనసభ్యుడయిన విషయం గుర్తు చేశారు. తనపై జనసేన అధ్యక్షుడు, నాయకులు చేస్తున్న ఆరోపణలు నిజమైనవి అయితే ఖండించబోనని.. అలాకాకుండా లేనిపోని నిందలు వేస్తే తగ్గేది లేదని, దాని కోసం ఎంతవరకైనా పోరాడుతానని స్పష్టం చేశారు.










