Jul 31,2023 20:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌ 2022-23 వార్షిక నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేసింది. హెచ్‌ఆర్‌సి ఛైర్మన్‌, సభ్యులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని సోమవారం కలిసి అందజేశారు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి, జ్యుడీషియల్‌ సభ్యులు దండే సుబ్రమణ్యం, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యులు జి.శ్రీనివాసరావుతో కలిసి ముఖ్యమంత్రికి నివేదించారు.