నాని తాజా చిత్రం 'హాయ్ నాన్న' సెకండ్ సింగిల్ త్వరలో రానుంది. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రంలో నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా నటించింది. ఈ చిత్రం నుండి 'సమయమా' అంటూ సాగే మొదటి పాటను ఇదివరకే విడుదల చేశారు. తాజాగా 'గాజు బొమ్మ' అంటూ సాగే పాటను అక్టోబర్ 6న విడుదల చేయబోతున్నట్లుగా నాని ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో నాని, కియారా ఖన్నా ముచ్చటగా మాట్లాడుకుంటూ.. గాజు బొమ్మ పాటను అనౌన్స్ చేశారు. తండ్రి కూతురు నేపథ్యంలోని ఈ పాట 'హాయ్ నాన్న' సోల్‌గా ఉండబోతోంది.










