
హైదరాబాద్ : రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఏపీలోని సీలేరు నుంచి ఆరుగురు నిందితులు హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. చౌటుప్పల్ దగ్గర ఎల్ బీ నగర్ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలో రెండు కార్లలో తరలిస్తున్న రూ.40 లక్షల విలువైన 200 కిలోల గంజాయి పట్టుబడింది. కార్లలోని ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కార్లు, మొబైల్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.