Nov 13,2023 15:29

గాజా :   గాజాలోని అల్‌-షిఫా ఆస్పత్రిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆరుగురు నవజాత శిశువులు, తొమ్మిది మంది రోగులు మరణించినట్లు గాజాస్ట్రిప్‌లోని డిప్యూటీ హెల్త్‌ మినిస్టర్‌ యూసెఫ్‌ అబు రిష్‌ సోమవారం తెలిపారు. గాజా ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ బాంబు దాడులు కొనసాగిస్తుండటంతో అనేక ఆస్పత్రుల్లో ఇంధన నిల్వలు హరించుకుపోయాయని, పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు నవజాత శిశువులు సహా ఓ రోగి మరణించారని, ఇంక్యుబేటర్‌లో ఇంకా 45 మంది శిశువులు ఉన్నట్లు ప్రకటించింది. ఆస్పత్రి నుండి చిన్నారులను, ఇతరులను ఆస్పత్రి నుండి ఖాళీ చేయించేందుకు సహకరిస్తున్నామన్న ఇజ్రాయిల్‌ ఆరోపణలను ఆరోగ్య నిపుణులు తిరస్కరించారు. కరెంటు లేకపోవడంతో ఇంక్యుబేటర్లు పనిచేయడం లేదని, కీలక సామగ్రి కొరత ఏర్పడుతున్నా.. ఇజ్రాయిల్‌ దళాలు ఆస్పత్రి వెలుపల యుద్ధం కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.