ఏథెన్స్ : గ్రీస్‌లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కన్జర్వేటివ్ న్యూ డెమోక్రసీ పార్టీ విజయం సాధించింది. మెజార్టీ సీట్లను సాధించి మరోసారి అధికారంలోకి రానుంది. మే 21 జరిగిన ఎన్నికల పోలింగ్ జరిగింది. కాగా, వీటి ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో కన్జర్వేటివ్ న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన ఆ దేశ ప్రధాని కైరియోకాస్ మిటోటాకిస్ 40.56 శాతం ఓట్లను సంపాదించి మరో నాలుగేళ్లపాటు తన పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి వామపక్ష సిరిజా పార్టీకి చెందిన అలెక్సిస్ సిప్రస్ 17.83 శాతం ఓట్లను సాధించి రెండో స్థానంలో నిలిచారు. 300 సీట్లున్న పార్లమెంటులో 151 స్థానాలు సీట్లు గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. తాజా ఎన్నికల్లో కన్జర్వేటివ్ న్యూడెమోక్రసీ పార్టీ 158 స్థానాలను గెలిచింది. దీంతో ఆదేశంలో ఉన్న ప్రతిపక్షాలకు, కన్జర్వేటివ్ న్యూడెమోక్రసీ పార్టీ 41 శాతం ఓట్ల తేడాతో భారీ మెజార్టీని సాధించడంతో మిటోటాకిస్ రెండోసారి ప్రధాన బాధ్యతను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా మిటోటాకిస్ మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రజలు మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సురక్షిత మెజారీటీని అందించారు. ఇకపై ప్రజలకు ఉపయోగపడే ప్రధాన సంస్కరణలు త్వరగా అమలు చేస్తాము' అని ఆయన అన్నారు.
కాగా, కైరియోకాస్ మిటోటాకిస్ ఎన్నికల ప్రచారంలో దేశ ఆర్థిక వృద్ధి, రాజకీయంగా దృష్టి సారించడంతో భారీ మెజార్టీని సొంతం చేసుకున్నారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.