Jul 29,2023 14:43

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ.. తెలంగాణ ప్రజల ప్రాణాలపై లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఉప్పల్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి.. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలపై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా సీఎం కేసీఆర్‌ రాజకీయాలపై దఅష్టిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వరదలతో 30 మంది చనిపోయినా కేసీఆర్‌ పరామర్శించేందుకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. తాత్కాలిక వరద సాయం కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లను తక్షణమే విడుదల చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.