Sep 23,2023 19:56

అంజలి నటించిన 'గీతాంజలి' చిత్రానికి సీక్వెల్‌ తీసుకురావాలని మేకర్స్‌ ఎప్పటి నుంచో ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా దీని గురించి చిత్రబృందం ఓ ప్రకటన చేసింది. 'ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి' అంటూ సీక్వెల్‌ గురించి ప్రకటించారు. ఈ చిత్రానికి 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్ర షూటింగ్‌ శనివారం నుంచి మొదలైంది. కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. అంజలి కథానాయికగా నటిస్తున్న 50వ సినిమా ఇది. ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్నారు.