ప్రజాశక్తి - పెనుకొండ (శ్రీసత్యసాయి) : ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ మండలంలో జరిగింది. స్థానిక వివరాల ప్రకారం ... పెనుకొండ మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన అఖిల (20), అదే గ్రామానికి చెందిన గొల్ల గోవర్ధన్ గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. గొల్ల గోవర్ధన్ రొద్దం సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రియుడు ప్రేమించి మోసం చేశాడన్న మనస్థాపంతో ప్రియురాలు అఖిల ఈరోజు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










