ప్రజాశక్తి- బి.కొత్తకోట (అన్నమయ్య) : బి.కొత్తకోట పట్టణంలోని కట్టమీద గంగమ్మ జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బోయ సంఘం నాయకులు జాతరలో భాగంగా పట్టణంలోని బోయవీధి ప్రజలు అమ్మవారికి బోనం సమర్పించేందుకు ఊరేగింపుగా గుడి వద్దకు చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ పూజారి ప్రసాద్ మాట్లాడుతూ ... భక్తిశ్రద్ధలతో, ఎంతో నిష్టతో అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రసాదుతోపాటు బోయ సంఘంగా నాయకులు ఆదినారాయణ, మంజు, వెంకటేష్, రాజేందర్ బాబు, అంజి, లక్ష్మణ, తదితరులు పాల్గొన్నారు.










