Oct 10,2023 17:24

పూజ ఎంటర్టైన్మెంట్‌ ఇప్పటికే దూసుకుపోతున్న భారతీయ చిత్ర పరిశ్రమలో మరో సంచలనానికి నాంది పలికింది. కొత్త తరహా ప్రపంచంలో వినూత్నమైన యాక్షన్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గణపధ్‌ ట్రైలర్‌ ప్రేక్షకులను మెస్మెరైజ్‌ చేస్తోంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గణపధ్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. వినూత్నమైన యాక్షన్‌తో కూడిన ఈ ట్రైలర్‌ చిత్ర వర్గాలతో పాటు.. ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, అక్టోబర్‌ 20న చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూసేలా చేసింది. టైగర్‌ ష్రాఫ్‌ తో పాటూ కృతి సనన్‌ మరియు అమితాబ్‌ బచ్చన్‌ ల కలయిక లో వచ్చిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో విపరీత అంచనాలు ఉన్నాయి. ఈ ఆసక్తిని మరింత పెంచేందుకు చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.