టెల్ అవీవ్ : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ఇజ్రాయిల్ లో పర్యటిస్తున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో ఆయన జెరూసలెం చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీన హమాస్ చేపట్టిన దాడులను నిరసిస్తూ.. ఇజ్రాయిల్‌కు మేక్రాన్ సంఘీభావం ప్రకటించనున్నట్లు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. గాజాలోని ప్రజల సంరక్షణకు మేక్రాన్ పిలుపునిస్తారని భావిస్తున్నట్లు తెలిపింది. పాలస్తీనాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు చేపడుతున్న సంగతి తెలిసిందే.