Oct 30,2022 13:02

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : టిడిపి కార్యకర్తల కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాం అని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు కశింకోట మేజర్‌ పంచాయతీ గోవింద రావు కాలనీకి చెందిన ఇటీవల అనారోగ్యానికి గురైన పార్టీ సీనియర్‌ కార్యకర్త ఓడుబోయిన వరహొ ఇంటికి వెళ్ళి వారిని గోవింద సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా కశింకోట పార్టీ నాయకులు సమకూర్చిన ''10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈయన తండ్రి ఒడుబోయిన అప్పారావుహొ సీనియర్‌ కార్యకర్త, పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో వున్నారు. వీరి పరిస్థితిని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళతామని అన్నారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలోహొ పార్టీ నాయకులు వేగి గోపీకృష్ణ, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, కాండ్రేగుల సతీష్‌, తాకాశి కృష్ణా, ఆడారి నరసింగరావు, వార్డు మెంబర్‌ జగన్నాధం, పెంటకోట తాతారావు, వై.భద్రం, రెడ్డి త్రినాధ్‌, కలగా చిన్నా, గొంతిన రమణ, కలగా శివ, గొల్లవిల్లి శంకర్‌,హొముప్పిడి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.